రామ్ తో జటకట్టనున్న మేఘా ఆకాష్ ?
Published on Mar 4, 2018 3:36 pm IST

డైరెక్టర్ త్రినాద్ దర్శకత్వంలో రామ్నటించబోయే సినిమా షూటింగ్ వచ్చేవారం నుండి ప్రారంభం కానుంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా నటిస్తుండగా మేఘా ఆకాష్ సెకండ్హీరోయిన్ గా ఖరారు అయినట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది.

లవ్, ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఉన్నది ఒకటే జిందగీ సినిమా తరువాత రామ్ నటించబోయే సినిమా ఇదే. విజయ్ కె చక్రవర్తి ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తుండగా ప్రసన్న కుమార్ మాటలు రాస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.

 
Like us on Facebook