గాల్లో తేలిపోతున్న యంగ్ హీరోయిన్ !
Published on Oct 19, 2017 3:36 pm IST

యంగ్ హీరో మెహ్రయిన్ కౌర్ ప్రస్తుతం గాల్లో తేలిపోతోంది. అందుకు కారణం ఆయన ఆమె నటించిన సినిమాలు వరుసగా హ్యాట్రిక్ సాధించడమే. మొదటగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ చిత్రం విజయం సాదించనప్పటికీ పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. దాదాపు సంవత్సరం పాటు మరో అవకాశం కోసం ఎదురుచూసిందామె. ఆమె ఎదురుచూపులు ఫలించి ఈ ఏడాది తెలుగులో వరుసగా రెండు సినిమాల్ని చేసింది.

అందులో ఒకటి శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’. కొద్దిరోజుల క్రితమే రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో మెహ్రీన్ కు కూడా మంచి పేరొచ్చింది. ఆ విజయంతో ఇక నా టైమ్ స్టార్ట్ అయిందన్న మెహ్రీన్ నిన్న విడుదలైన రవితేజ ‘రాజా ది గ్రేట్’ తో మరొక విజయాన్ని అందుకుని తెలుగు పరంగా హ్యాట్రిక్ విజయాల్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

ఆఫర్లు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ధరమ్ తేజ్ ‘జవాన్’ సినిమాలో నటించిన ఆమె సందీప్ కిషన్ తో ‘కేరాఫ్ సూర్య’ అనే ద్విభాషా చిత్రాన్ని చేసింది. ఆ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook