మెహ్రీన్.. చెయ్యను అంటూనే చేసేసింది !

Published on Dec 6, 2018 5:33 pm IST

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా రేపు విడుదల కానున్న తాజా చిత్రం ‘కవచం’. అయితే ఈ చిత్రంలోని తన పాత్ర గురించి మెహ్రీన్ మాట్లాడుతూ.. తను మొదట ఈ సినిమాలో నటించనని చెప్పానని తెలిపింది. ఎందుకంటే సినిమాలో ఆమె పాత్ర కేవలం ఓ అతిధి పాత్రలానే ఉంటుందట.. అందుకే ఆమె మొదట ఇంట్రస్ట్ చూపించలేదట.

పైగా ఈ సినిమాలో మెహ్రీన్ పాత్ర్ర చనిపోతుంది. ఆమె మర్డర్ మిస్టరీని చేధించడానికి హీరో ఓ మిషన్ ను ప్రారంభిస్తాడు. మొత్తానికి నిర్మాతలు మరియు కవచం చిత్రబృందం పై ఉన్న నమ్మకంతో మెహ్రీన్ ఈ సినిమాలో నటించదట.

ఇక హీరో క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి గా నటించిన ఈ చిత్రాన్నినూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :

X
More