“గని” కోసం మిల్కీ బ్యూటీ..ఎంతవరకు నిజం?

Published on Jul 25, 2021 5:41 pm IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో “గని” కూడా ఒకటి. దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ చిత్రంపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం సెట్స్ కి మొన్ననే బన్నీ కూడా వెళ్లి సందడి చేసాడు. అయితే మంచి ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మరో ఆసక్తికర బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కి గాను మిల్కీ బ్యూటీ తమన్నాని మేకర్స్ రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఎంతవరకు నిజముందో కానీ ప్రస్తుతం ఈ టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్ద నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :