ఓటిటి లో ‘మాసూద’ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్

ఓటిటి లో ‘మాసూద’ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్

Published on Dec 24, 2022 1:21 AM IST


ఇటీవల వచ్చిన పలు హర్రర్ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన మాసూద మూవీలో హర్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేసాయని ఇటీవల ఈ మూవీకి పలువురు సినీ విశ్లేషకులు ఇచ్చిన ప్రశంశ. ముఖ్యంగా థియేటర్స్ లో అందరినీ అలరించి మంచి విజయం అందుకున్న ఈ మూవీ, నిన్న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కాగా గడచిన 48 గంటల్లోనే ఈ మూవీ ఏకంగా 50 మిలియన్ నిమిషాల వ్యూస్ ని దక్కించుకుని అదిరిపోయే రెస్సాన్స్ ని సొంతం చేసుకుందని కొద్దిసేపటి క్రితం ఆహా వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందగా సాయికిరణ్ దీనికి దర్శకత్వం వహించారు. మొత్తంగా తమ సినిమా అటు థియటర్స్ లో ఇటు ఓటిటి లో రెండింటా మంచి సక్సెస్ అందుకోవడంతో మాసూద టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు