తెలంగాణాలో థియేటర్స్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన తలసాని.!

Published on Mar 24, 2021 3:03 pm IST

ఇప్పుడు మళ్ళీ దేశంలో కరోనా ఉదృతి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అంతా తగ్గింది వాక్సిన్ కూడా వచ్చింది అనుకునే లోపే మళ్ళీ భారీ ఎత్తున కేసులు పెరుగుతుండడం కలవర పెట్టింది. మళ్ళీ గత ఏడాది లా ఉండకూడదని ప్రతీ ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి గత ఏడాది కరోనా దెబ్బ వల్ల తీవ్ర నష్టం చూసిన సినీ పరిశ్రమ థియేటర్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

మరి ఈ టైం లో మళ్ళీ లాక్ డౌన్ థియేటర్స్ మూసేస్తారు అని వదంతులు తెలంగాణాలో మొదలు కాగా అక్కడి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్లారిటీ ఇచ్చారు. థియేటర్స్ మళ్ళీ మూస్తారని వస్తున్న వదంతులతో ఎటువంటి నిజం లేదని థియేటర్స్ తెరిచే ఉంటాయి కాకపోతే కోవిడ్ నిబంధనలతో రన్ అవుతాయని తలసాని క్లారిటీ ఇచ్చారు. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

సంబంధిత సమాచారం :