అఖిల్ జాబితాలో మరొక దర్శకుడు !
Published on Feb 22, 2018 3:46 pm IST

ఇటీవలే ‘హలో’ చిత్రంతో మెప్పించిన అఖిల్ అక్కినేని తన తరవాతి సినిమా గురించి ఇది వరకే అధికారిక ప్రకటన చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి ఊసు లేదు. దీంతో ఆయన చిత్రంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటికే అఖిల్ 3వ సినిమాను పూరి జగన్నాథ్, కొరటాల శివ, సత్య ప్రభాస్ పినిశెట్టి వంటి దర్శకులు డైరెక్ట్ చేస్తారని వార్తలు రానా నిన్న ‘జై లవ కుశ’తో హిట్ కొట్టిన దర్శకుడు బాబీ అఖిల్ కు కథ చెప్పినట్టు, అఖిల్ కథపై సుముఖంగానే ఉన్నట్టు సమాచారం అందింది. ఇక ఈరోజు చూస్తే ఇటీవలే ‘తొలిప్రేమ’తో ఘన విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరితో కూడ చర్చలు జరుగుతున్నాయనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ కన్ఫ్యూజన్ కు తెరపడాలంటే అఖిల్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.

 
Like us on Facebook