ప్రస్తుతమున్న తెలుగు స్టార్ హీరోయిన్లలో రాశీ ఖన్నా కూడా ఒకరు. చేతిలో పెద్ద ప్రాజెక్టులు, వరుస విడుదలలు ఉన్నప్పటికీ ఈమెకు లక్ మాత్రం పూర్తి స్థాయిలో కలిసిరావడంలేదు. గత కొన్నాళ్లుగా ఈమె సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నారు. గత ఏడాది రిలీజైన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ కాస్తో కూస్తో వర్కవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన ‘ఆక్సిజన్’, మూడు రోజుల క్రితం విడుదలైన ‘టచ్ చేసి చూడు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి.
దీంతో ఈమె తన ఆశలన్నీ ఈ వారంలోనే రిలీజ్ కానున్న వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ మీదే పెట్టుకుంది. ఇప్పటికైతే ట్రైలర్, పాటలు బాగా ప్రాచుర్యం పొంది సినిమాపై పాజిటివ్ క్రేజ్ బాగానే ఏర్పడింది. అంతేగాక బాగా సన్నబడి కనిపిస్తున్న రాశీ లుక్ కి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. మరి ఈ మెగా హీరో సినిమాతో అయినా ఆమె ఆశించిన, ఆమెకు కావాల్సిన సాలిడ్ హిట్ దొరకాలని ఆశిద్దాం. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూఎస్లో ఫిబ్రవరి 9న ఇండియాలో ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది.


