లేటెస్ట్ : వంద కోట్ల బడ్జెట్ తో భారీ మూవీ నిర్మించనున్న మోహన్ బాబు, విష్ణు

Published on Jun 2, 2023 2:00 am IST

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం మూవీలో దూర్వాస మహర్షి పాత్రలో నటించి మరొక్కసారి తన నటనతో ఆడియన్స్ ని అలరించారు. ఇక తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించిన అనంతరం అక్కడి స్థానిక మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ, అతి త్వరలో తాను మరియు తన కుమారుడు విష్ణు కలిసి రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ మూవీని నిర్మించనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం తిరుపతిలోని తమ యూనివర్సిటీ చక్కగా రన్ అవుతోందని, అలానే రాబోయే మరికొద్ది రోజుల్లో తమ భారీ బడ్జెట్ మూవీ గురించిన పూర్తి వివరాలు కుమారుడు విష్ణు వెల్లడిస్తారని ఆయన అన్నారు. అయితే పరమ శివ భక్తుడైన భక్త కనప్పపై సినిమా చేయాలనేది మోహన్ బాబు చిరకాల కోరిక, మరి ఈ భక్తిరస చిత్రానికి సంబంధించి మంచు విష్ణు ప్రకటన ఏమైనా ఉంటుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :