బోరున ఏడ్చేసిన మోహన్ బాబు..!
Published on May 30, 2017 9:31 pm IST


దర్శక రత్న దాసరి మరణంతో తెలుగు సినీలోకం విలవిలలాడుతోంది. దాసరి మరణ వార్త వినగానే కిమ్స్ ఆసుపత్రి వద్దకు మోహన్ బాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు బోరున విలపించారు. తాను దాసరి మరణ వార్తని జీర్ణించుకోలేకపోతున్నానని మోహన్ బాబు అన్నారు. నాకు ఆయన తండ్రితో సమానమని అన్నారు. తన కు నటుడిగా గుర్తింపు తీసుకుని వచ్చింది దాసరే అని అన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు మోహన్ బాబు అన్నారు.

మోహన్ బాబుతో పాటు కొంత మంది సినీ ప్రముఖులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న తరువాత దాసరి మృత దేహాన్ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి చేర్చారు. రేపు దాసరి అంత్య క్రియలు జరగనున్నాయి.

 
Like us on Facebook