ఆ బయోపిక్ లో మోహన్ బాబు రోల్ ఏంటంటే !


మహానటి సావిత్రి బయోపిక్ మొదలైనప్పటినుంచే ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మహానటి పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటిస్తోంది. కాగా మిగిలిన తారాగణంపై అనేక వార్తలు వచ్చాయి. సావిత్రి జీవితం అనేక మంది ప్రముఖులతో ముడి పడి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. తాజగా ఈ చిత్రం గురించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మహా నటి చిత్రంలో లెజెండరీ నటుడు ఎస్ వి రంగారావు పాత్రని మోహన్ బాబు పోషించనున్నారు. మోహన్ బాబు పాత్ర పై అక్టోబర్ లో చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా మహా నటి చిత్ర యూనిట్ ఎస్ వి రంగారావు, సావిత్రి మధ్య ఉండే స్నేహం గురించి శోధిస్తున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దూల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.