“భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరో కన్ఫర్మ్ అయ్యింది.!

Published on Feb 19, 2022 1:53 pm IST

టాలీవుడ్ నుంచి వస్తున్న లేటెస్ట్ కొన్ని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కి రెడీ అవుతుండగా మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ట్రైలర్ లకి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ తెలుస్తున్నాయి.

అయితే మొదటిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ కి గాను ఏ ముఖ్య అతిథులు మన టాలీవుడ్ నుంచి లేరు అని తెలిసిందే. కానీ ఇప్పుడు అయితే ఈ ఈవెంట్ కి గాను తెలంగాణా మన్త్రి కేటీఆర్ హాజరు అయ్యే అవకాశం ఉందని టాక్ రాగా ఇప్పుడు అది నిజమే అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఇంకో పక్క ఈ ఈవెంట్ ని ఈ ఫిబ్రవరి 21న ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈవెంట్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :