క్రిస్మస్ కు టీజర్ తో రానున్న అఖిల్ ?

Published on Dec 9, 2018 11:39 pm IST

యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈచిత్రం యొక్క టీజర్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ను ఈ నెల 13న కానీ 14న కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈవార్తల ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సివుంది.

వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ 25వ చిత్రం జనవరి 25న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :