ప్రభాస్ కొత్త చిత్రం లాంచ్ అయ్యేది ఎప్పుడో తెలుసా !
Published on Feb 12, 2017 12:29 pm IST


‘బాహుబలి’ విజయంతో జాతీయ స్థాయి హీరోగా మారిపోయిన ప్రభాస్ ‘బాహుబలి-2’ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. ఈ ఆసక్తి మధ్య ఆయన ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ కు ఛాన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక దర్శకుడు సుజీత్ అయితే ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా కాలం నుండి ఈ ప్రాజెక్ట్ మీదే కష్టపడుతూ ఎట్టకేలకు బలమైన స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నాడు.

పైగా ‘బాహుబలి 2’ షూట్ పూర్తై ప్రభాస్ కు కాస్త విశ్రాంతి కూడా దొరకడంతో వీరిరువురూ చర్చలు జరిపి సినిమాను ఇక లాంచ్ చేస్తే బాగుంటుందని నిర్ణయానికొచ్చారు. ఆ లాంచింగ్ కు రేపు 13వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ప్రత్యేక అతిధుల మధ్య పూజా కార్యక్రమాలతో ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ విషయాన్ని సుజీత్ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు స్వస్తి చెప్పి సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టారు.

 
Like us on Facebook