ఎన్టీఆర్ సినిమాకు ముహూర్తం ఖరారు !
Published on Mar 5, 2018 11:42 am IST

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29న ప్రారంభం కానుంది. మర్చి 29న తెలుగుదేశం పార్టి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు సినిమాను ప్రారంభించబోతున్నారు. కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. కళ్యాణ్ రమ్ అబ్బాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో బాలయ్య 72 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. కృష్ణ, నాగేశ్వర రావ్ వంటి నటులతో పాటు సినారె బాపు వంటి రచయితలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పి.వి. నరసింహరావ్, ఇందిరాగాంధీ పాత్రలు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది జనవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

 
Like us on Facebook