‘అకిరా’.. మురుగదాస్ కొత్త సినిమా!

‘అకిరా’.. మురుగదాస్ కొత్త సినిమా!

Published on Mar 18, 2015 5:25 PM IST

murgudas-and-sonakshi-sinha
కొత్త కథాంశాలనే సున్నితమైన భావోద్వేగాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు.. ఏ. ఆర్. మురుగదాస్. తన కథలతో కేవలం తమిళంలోనే కాక తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా తానేంటో నిరూపించుకున్నారు. తమిళంలో ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె తండ్రి శత్రఘ్ణ సిన్హా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళింది. తమిళంలో కొంత కాలం క్రితం విడుదలై ఘనవిజయం సాధించిన ‘మౌనగురు’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. సమకాలీన అంశాలతో, బలమైన కథాంశంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు ‘అకిరా’ అన్న పేరు పెట్టినట్టు తెలుస్తోంది. అకిరా మంచి గుండె నిబ్బరం కలిగి ఉన్న వ్యక్తి అన్న అర్థం వచ్చేలా ఆ పేరును పెట్టారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు