భారతీయుడు 2 కు మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్ !

Published on Dec 11, 2018 8:41 am IST

లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్ ల కలయికలో రానున్న ‘భారతీయుడు 2’ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. సూపర్ హిట్ మూవీ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్ 14నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించనుండగా ప్రముఖ తెలుగు కమెడియన్ వెన్నల కిశోర్ ఒక ముఖ్య పాత్రను పోషించనున్నాడు. ఇక ఈ చిత్రం కమల్ కు చివరిది కానుంది. ఈ సినిమా తరువాత ఆయన నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో బిజీ కానున్నారు.

సంబంధిత సమాచారం :