‘నా నువ్వే’ కొత్త విడుదల తేదీ !

Published on May 26, 2018 2:33 pm IST

కళ్యాణ్ రామ్ తొలిసారి చేస్తున్న పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయకిగా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నెలలోనే విడుదలకావల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో వాయిదాపడి జూన్ 14న విడుదలకానుంది.

కొద్దిసేపటి క్రితమే ఈ కొత్త తేదీని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షరత్ సంగీతం అందించిన ఈ చిత్రం యొక్క రన్ టైమ్ గంట 58 నిముషాలుగా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పి.సి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.

సంబంధిత సమాచారం :