నా పేరు సూర్య లేటెస్ట్ న్యూస్ !

వక్కంతం వంశి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న నా పేరు సూర్య సినిమా పాట చిత్రీకరణ రేపటి నుండి అమెరికాలో జరగనుంది. అను ఇమ్యాన్యూల్, బన్ని మీద రొమాంటిక్ సాంగ్ షూట్ చెయ్యబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్ హీరో అర్జున్ ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు.

విశాల్ శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాను రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.శరత్ కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా లో దేశభక్తి గల యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. ఏప్రిల్ రెండోవారంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లో చెయ్యబోతున్నారు.