నా పేరు సూర్య కొత్త విడుదల తేది!

వక్కంతం వంశి దర్శకత్వంలో బన్ని నటిస్తోన్న సినిమా నా పేరు సూర్య. అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 27న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఒక రోజు ముందే రాబోతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

రామలక్ష్మి సినీ క్రియేషన్స్ సంస్థలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమా లో రావ్ రమేష్, బోమైన్ ఇరాని ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఫాదర్ క్యారేక్టర్ లో తమిళ్ హీరో అర్జున్ నటిస్తున్నాడు. రైటర్ గా పలు సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశి ఈ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషం.