“దూత 2” పై ఇంట్రెస్టింగ్ హిట్ ఇచ్చిన చైతూ.!

“దూత 2” పై ఇంట్రెస్టింగ్ హిట్ ఇచ్చిన చైతూ.!

Published on Mar 21, 2024 11:06 AM IST


ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో భారీ చిత్రం “తండేల్” (Thandel) చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనికి ముందు చైతు మెయిన్ లీడ్ లో నటించిన తన మొట్ట మొదటి వెబ్ సిరీస్ “దూత” తో ఓటిటిలో సూపర్ హిట్ ఎంట్రీ తాను ఇచ్చాడు.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో చేసిన ఈ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ అయ్యింది. మరి దీనితో సీక్వెల్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తుండగా మొన్న జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ లో దూత 2 పై అప్డేట్ వస్తుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆరోజు ఎలాంటి అప్డేట్ ని మేకర్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ అందించలేదు. అయితే ఇప్పుడు నాగ చైతన్య ఇచ్చిన హింట్ పార్ట్ 2 పై ఆసక్తి రేపింది. తన దూత టీం తో కలిసి మరింత మున్ముందు రాబోతుంది అతి త్వరలో అన్నట్టుగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసాడు. దీనితో దూత 2 పై రానున్న రోజుల్లో అధికారిక అప్డేట్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ లో ప్రాచి దేశాయ్, ప్రియా భవాని శంకర్ తదితరులు నటించగా శరత్ మరార్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు