నాగ చైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

Published on Jul 5, 2018 4:01 pm IST

అక్కినేని నాగ చైతన్య చేస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు 31న విడుదలకానుంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే అది ఈ జూలై నెల 8 లేదా 9వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ చిత్ర దర్శకుడు మారుతి గత చిత్రం ‘మహానుభావుడు’ మంచి విజయాన్ని సాధించి ఉండటంతో ఈ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇకపోతే నాగ చైతన్య మరొక చిత్రం ‘సవ్యసాచి’ ఆగష్టు 17న విడుదలవుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :