ఫిబ్రవరి నుండి కొత్త సినిమాని మొదలుపెట్టనున్న నాగ శౌర్య !

గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు ద్వారా ఇకపై చేయబోయే సినిమాలన్నింటినీ రెట్టింపు బాధ్యతతో చేస్తానని యంగ్ హీరో నాగ శౌర్య అంటున్నారు. అయన నటించిన ‘ఛలో’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుండగా ఆ పనులు ముగిసిన వెంటనే కొత్త సినిమాని మొదలుపెట్టనున్నారాయన. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నెలాఖరు నుండి మొదలవుతుంది.

సాయి శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం పూర్తిస్థాయి ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఉండనుంది. ఇందులో శౌర్యకు జోడీగా నివేతా థామస్ నటించనుందని తెలుస్తోంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై మన్యం విజయ్ కుమార్ నిర్మించనున్నారు. దీని తర్వాత ఈ యువ హీరో మరొక కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో ‘నర్తనశాల’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ ను చేయనున్నారు.