గత కొంత కాలం నుంచి ఒక్క సరైన హిట్ సినిమా కోసం చూస్తున్న నిర్మాత సూర్య దేవర నాగవంశీ. అయితే తనకి పర్ఫెక్ట్ కం బ్యాక్ గా నిలిచిన సినిమా మాత్రం ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మన టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) అని చెప్పాలి.
ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ నాగవంశీ గట్టి నమ్మకంగా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ విజయం నవీన్ కంటే నాగవంశీకే చాలా కీలకంగా మారింది. అందుకు తగ్గట్టుగానే నవీన్ కూడా ఎంతో ఎఫర్ట్స్ ఈ సినిమాకి పెట్టి జనంలోకి తీసుకెళ్లాడు. దాని రిజల్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా డే 1 రికార్డు ఓపెనింగ్స్.
ఈ సినిమాకి ఏకంగా 22 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఈ సంక్రాంతి బరిలో మరో విన్నర్ గా ఈ సినిమా నిలవడమే కాకుండా నాగవంశీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని భావించిన తన ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇచ్చింది. మంచి టాక్ తో పాటుగా సాలిడ్ బుకింగ్స్ ని ఈ సినిమా కొనసాగిస్తుంది. మరి ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.
రాజు గారు అసలైన సంక్రాంతి సంబరాలు తెచ్చేసారు….????????#AnaganagaOkaRaju hits 22 Crores+ Worldwide Gross on Day 1 ????
ఇంటిల్ల పాది నవ్వుల సునామీ…. ????????#AOR In cinemas now #BlockbusterAOR
Star Entertainer @NaveenPolishety @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/beK8ZyaOTi
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2026


