వర్మతో సినిమా చేయడానికి నాగార్జున పెట్టిన కండిషన్స్ !
Published on Nov 7, 2017 5:32 pm IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జునతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘శివ’ ట్రెండ్ సెట్టర్ గా నిలవడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 20 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మొదట వర్మ వచ్చి సినిమా చేద్దాం అనగానే నాగార్జున వెంటనే ఒప్పుకోలేదట పైగా కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట.

అవేమిటంటే ముందు పూర్తి స్క్రిప్టును రెడీ చేయాలని, ఆ తర్వాత తన అభిప్రాయం చెప్పే వరకు వేరే సినిమాలను తాకకుండా తన సినిమా మీదే పూర్తి దృష్టి పెట్టాలని కండిషన్ పెట్టారట. వర్మ కూడా నాగార్జున మాట ప్రకారమే అన్ని పనుల్ని పక్కబెట్టి నాగార్జున మెచ్చే విధంగా స్క్రిప్ట్ రెడీ చేశారట. వర్మ పనితనం చూసిన నాగ్ కూడా వెంటనే సినిమాకు ఓకే చెప్పేశారట.

మొదటగా 10 రాజుల పాటు షూట్ చేసిన అనంతరం నాగార్జున బ్రేక్ తీసుకుని తాను స్వయంగా నిర్మిస్తున్న అఖిల్ యొక్క ‘హలో’ విడుదల పనుల్ని పూర్తిచేసి ఆ తర్వాత రెండవ షెడ్యూల్ మొదలుపెడతారట. ఇకపోతే ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు.

 
Like us on Facebook