చైతు – సామ్ విడాకుల పై నాగ్ స్పందన !

Published on Oct 2, 2021 9:12 pm IST

అక్కినేని నాగ చైతన్య – సమంత తమ వైవాహిక బంధానికి సంబంధించి స్పందిస్తూ.. ‘మేము భార్యాభర్తలుగా విడిపోయినా తమ మధ్య స్నేహ బంధం మాత్రం కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా చై – సామ్ విడాకుల పై అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. ‘ఎంతో బాధపడుతూ ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సమంత, చైతు విడిపోవటం నిజంగా ఎంతో దురదృష్టకరం. కానీ భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం. అయితే సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు.

సమంతతో మా ఫ్యామిలీ గడిపిన ప్రతిక్షణం మాకు ఎంతో మధురమైనది. సమంత మా ఫ్యామిలీకి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అంటూ నాగార్జున పోస్ట్ చేశారు. చైతు – సామ్ మధ్య గొడవలని పరిష్కరించడానికి నాగార్జున కూడా ప్రయత్నించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :