ఏఎన్నార్ బయోపిక్ చేయడంలేదన్న నాగార్జున !

Published on May 31, 2018 8:26 am IST

తెలుగు పరిశ్రమలో బయోపిక్స్ సాంప్రదాయం జోరందుకుంటున్న తరుణంలో ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి ప్రముఖుల జీవితాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటితో పాటే తోలి తరం అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావుగారి జీవితాన్ని కూడ అక్కినేని నాగార్జున బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలొచ్చాయి.

కానీ వీటిపై స్పందించిన నాగార్జున అలాంటిదేం లేదని అన్నారు. తన తండ్రి జీవితం అందంగా, ఆనందంగా, ఆదర్శప్రాయంగా గడిచిందని, అందులో ఎలాంటి ఒడిదుడుకులు లేవని, చివరి రోజుల్లో కూడ ఆయన సంతోషంగా ఉన్నారని, కాబట్టి బయోపిక్ ద్వారా చెప్పాల్సింది ఏమీ లేదని, ఆయన కథ సినిమాగా కన్నా ఒక పుస్తకంలా బాగుంటుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :