స్టార్ హీరో దర్శకత్వంలో నాగార్జున ?

తమిళ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా రాణిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ‘పా పాండి’ అనే సినిమాటి దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న ధనుష్ ఇప్పుడు మరో సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజాగా ఈ చిత్రంలో తెలుగు సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్నారనే వార్తలు తమిళ సినీ వర్గాల్లో తెగ హడావుడి చేస్తున్నాయి. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతుందని, ఇందులో ధనుష్ ప్రధాన హీరోగా నటిస్తారని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.