వరుస భారీ హిట్స్ తో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.!

Published on Aug 6, 2022 3:47 pm IST

గత ఏడాది ఎండింగ్ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు మాత్రం నందమూరి అభిమానులకి ఒకదాన్ని మించి ఒక భారీ ట్రీట్ వచ్చిందని చెప్పాలి. ఏ హీరో అభిమాని తన హీరో మంచి సక్సెస్ అందుకుంటే చూడాలి అనుకోడు? మరి ఇప్పుడు అలాగే నందమూరి ఫ్యామిలీ తమ ఫ్యాన్స్ కి అయితే భారీ ట్రీట్ ని అందిస్తున్నారు.

మొదటగా నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అఖండ” తో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని బాలయ్య కొట్టగా నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లింది.

అయితే ఈ చిత్రం తర్వాత ఇక ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “బింబిసార” కూడా మొదటి ఆట తోనే సాలిడ్ మౌత్ టాక్ ని తెచ్చుకుంది. దీనితో అయితే ఇలా వరుస హిట్స్ తో నందమూరి అభిమానులు ఈ హ్యాపీ మూమెంట్స్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :