‘రణబాలి’ ట్రైలర్ చూసి స్టన్నైన నారా లోకేష్.. స్పెషల్ థాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ!

‘రణబాలి’ ట్రైలర్ చూసి స్టన్నైన నారా లోకేష్.. స్పెషల్ థాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ!

Published on Oct 10, 2026 2:04 PM IST

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో ఒకటే ‘రణబాలి’. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసి ప్రముఖ రాజకీయ నాయకుడు నారా లోకేష్ పొగడకుండా ఉండలేకపోయారు.

రణబాలి ట్రైలర్ ఇప్పుడే చూసాను వావ్ అనిపించేలా ఉంది, ఒక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇది. 1800 ల నాటి రాయలసీమ ప్రాంతాన్ని మళ్ళీ రూపొందించడం అద్భుతంగా అనిపించింది. అప్పటి బ్రిటిష్ నేతల అరాచకాలు చూపించడం హృదయాన్ని కదిలించింది అని విజయ్ దేవరకొండ సూపర్బ్ గా కనిపిస్తున్నాడని తనకి, చిత్ర యూనిట్ అందరికీ తన బెస్ట్ విషెస్ తెలిపారు.

ఇక దీనికి గాను విజయ్ దేవరకొండ కూడా అంతే మర్యాదపూర్వకంగా లోకేష్ అన్నా అంటూ సీమ నేల నాకు ఎంతో ఇచ్చింది, మీ సందేశం మా అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఒక గొప్ప సినిమా అనుభవం మీ కోసం వేచి ఉంది; మన నేల, మన ప్రజల పట్ల మనలో గర్వాన్ని నింపే చిత్రం అది. మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు. దీనితో రణబాలి విషయంలో వీరి పోస్ట్ లు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు