నానికి హ్యాపీ నెస్ తెచ్చిపెట్టిన ఉగాది

నానికి హ్యాపీ నెస్ తెచ్చిపెట్టిన ఉగాది

Published on Mar 22, 2015 7:05 PM IST

Nani
యంగ్ హీరో నానికి గత సినిమాలు అన్నీ నిరాశ పరిచాయి. అందుకే ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని నాని చేసిన రెండు సినిమాలో ఈ ఉగాది పర్వదినాన రిలీజ్ అయ్యాయి. ఈ ఉగాది రోజున నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ ఇరు రాష్ట్రాల తెలుగు ఆడియన్స్ నుంచే కాకుండా అబ్రాడ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యుఎస్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి మంచు కలెక్షన్స్ వస్తున్నాయి.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఓ కొత్త కాన్సెప్ట్, విజువల్స్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, జెండాపై కపిరాజు ఓ సోషల్ మెసేజ్ తో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు సినిమాలకి బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో నాని చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతే కాకుండా తనకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రేక్షకులందరికీ థాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం నాని గీత ఆర్ట్స్ లో ఓ సినిమా, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు