అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని !
Published on Feb 26, 2018 3:27 pm IST

అవసరాల శ్రీనివాస్ గతంలో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ తోలి సినిమాతోనే అవసరాల మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న అవసరాల అందుకోసం ఓ మంచి కథని కూడా ప్రిపేర్ చేశాడట. ఈ ప్రాజెక్ట్ ను వారాహి చలనచిత్ర సంస్థ నిర్మించబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ ప్రాజెక్ట్ ఉన్నట్లు సమాచారం.

నాని ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు బాగానే పాపులర్ అయ్యాయి. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ సినిమా ఉంటుందని సమాచారం. జూన్ లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 
Like us on Facebook