“దసరా” నుంచి నాని మాస్ గ్యాంగ్ పోస్టర్ రిలీజ్..!

“దసరా” నుంచి నాని మాస్ గ్యాంగ్ పోస్టర్ రిలీజ్..!

Published on Aug 7, 2022 1:33 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా మేకర్స్ అయితే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ లేటెస్ట్ గా ఈ ఫ్రెండ్షిప్ డే కానుకగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని నాని పై రిలీజ్ చేశారు.

ఈ సినిమా డార్క్ మార్క్ లోనే నాని తో పాటుగా ఈ సినిమాలో కనిపించే తన ఫ్రెండ్స్ పాత్రలు అందరితో కలిసి నాని మంచి హ్యాపీ మూమెంట్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ పోస్టర్ తో అయితే నాని కూడా ఇంట్రెస్టింగ్ ట్యాగ్ పెట్టాడు. “ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం” అంటూ తన మాస్ గ్యాంగ్ తో కలిసున్న పిక్ షేర్ చేసాడు మొత్తానికి అయితే ఈ స్పెషల్ డే కి మేకర్స్ నుంచి వచ్చిన ఈ పోస్టర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు