నాని మరోసారి డాక్టర్ పాత్రలో !
Published on Aug 16, 2018 2:00 pm IST

‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో నాని ‘జెర్సీ’ చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారభం కానుంది. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు . అందులో ఒకటి క్రికెటర్ గా తండ్రి పాత్రలో మరొకటి కొడుకుగా డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇక నాని శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ‘దేవదాస్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో కూడా డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన అగ్ర హీరో నాగార్జున తో కలిసి నటిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook