నాని “గ్యాంగ్ లీడర్” లో పెన్సిల్ ఎవరు?

Published on Jul 23, 2019 6:59 am IST

విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్, హారో నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఓ విభిన్న కధాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడని సమాచారం. ఓ బాలిక, వృద్ధురాలితో కలిపి ఐదుగురు స్త్రీలు కలిగిన నాని “గ్యాంగ్ లీడర్ ” ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

కాగా నిన్న టీజర్ డేట్ ప్రకటిస్తూ నాని మరో పోస్టర్ ని విడుదల చేసారు. ఓ లైబ్రరీలో కుర్చీలో చేతిలో పెన్సిల్ తో నాని కూర్చొని ఉన్నాడు. ఆసక్తి కరంగా ఆయన “పెన్సిల్ ని అతని గ్యాంగ్ ని 24న కలవండి, వాళ్లు చాలా ఫన్ అందించబోతున్నారు, పెన్సిల్ అనేది నా పెన్ నేమ్, గ్యాంగ్ లీడర్ టీజర్ 24 వ తేదీ ఉదయం 11గంటలకి విడుదల” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాని పెట్టిన ఈ పోస్ట్ తరువాత అసలు ఈ పెన్సిల్ ఎవరు?, ఈ పెన్సిల్ కథేమిటీ అనే అనుమానాలు కలుగకమానవు. కనీసం టీజర్ లో నైనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందేమో చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :