కారు ప్రమాదంపై క్లారిటీ ఇవ్వనున్న నాని !

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మిస్తోన్న సినిమా ‘అ !. ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు రవితేజ, నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రంలో కాజల్, నిత్య మీనన్‌, శ్రీనివాస్‌ అవసరాల, ఈషా రెబ్బ, రెజీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ రోజు ‘అ !’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. దీన్నే మంచి సందర్బంగా భావించిన నాని ఈ మధ్య తనకు జరిగిన కారు ప్రమాదంపై మీడియాలో వస్తున్న రకరకాల వార్తల నైపథ్యంలో అభిమానులకు,  ప్రేక్షకులకు అసలు వాస్తవాలను తెలియజేయాలనుకుంటున్నారట. దీని వలన ఇన్నిరోజులు అనాధారంగా పుట్టుకొస్తున్న రూమర్లకు చెక్ పడనుంది.