ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హాయ్ నాన్న”.!

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హాయ్ నాన్న”.!

Published on Jan 4, 2024 6:56 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో ‘హాయ్ నాన్న” కూడా ఒకటి. మరి నాని హీరోగా గత ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసాడు. ఒకటి కంప్లీట్ మాస్ అయితే ఒకటి కంప్లీట్ క్లాస్ గా ఫ్యామిలీ డ్రామాలా తీసుకొచ్చాడు. ఇక హాయ్ నాన్న తో మరో మంచి హిట్ ని తన కెరీర్ లో స్కోర్ చేయగా ఈ చిత్రం థియేటర్స్ లో సాలీడ్ రన్ ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఓటీటీ లోకి వచ్చేసింది.

మరి ఈ సినిమా హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చేసింది. యంగ్ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని ఓటీటీ చూడాలి అనుకునేవారు తప్పకుండా చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి హేశం అబ్దుల్ వహాద్ సంగీతం అందించగా కొత్త నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు