నాని ‘ఎంసిఎ’ ఆడియో విడుదల ఆ రోజే ?
Published on Nov 13, 2017 11:12 am IST

నాని హీరోగా వస్తున్న తాజాచిత్రం ‘ఎంసిఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభిస్తోంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ఆడియోను నవంబర్ 25 విడుదల చెయ్యబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాలో ‘ఫిదా’ సినిమాతో అందరి ద్రుష్టిని ఆకర్షించిన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు దివాకర్ మని కెమెరామెన్. డిసెంబర్ 3వ వారంలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook