ఈ సంవత్సరం మరొక సినిమాను సిద్ధం చేస్తున్న నాని !
Published on Jul 17, 2017 3:00 pm IST


ఒకటి కాదు రెండు కాదు మొన్న విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రంతో వరుసగా 7 హిట్లందుకున్న నాని ఈ సంవత్సరం ఇంకో సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట టీమ్.

ఇప్పటికే ఈ సంవత్సరం ‘నేను లోకల్, నిన్ను కోరి’ లతో భారీ హిట్లందుకున్న నాని ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వీరీ కాంబినేషన్లో వచ్చిన ‘నేను లోకల్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook