‘కాకా’ కోసం ఆయా షేర్.. బాస్ తో బ్యాంగర్ రాబోతోందా?

‘కాకా’ కోసం ఆయా షేర్.. బాస్ తో బ్యాంగర్ రాబోతోందా?

Published on Oct 10, 2026 3:00 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రమే ‘కాకా’. టాలెంటెడ్ దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావస్తుంది. ఇక ఈ సినిమా సౌడింగ్ పరంగా థమన్ కూడా ఎప్పటికప్పుడు మంచి హైప్ కూడా ఇస్తూ వస్తున్నాడు. ఆ మధ్యనే ఫస్ట్ సింగిల్ త్వరలోనే అంటూ టీజ్ చేశారు కానీ తర్వాత మళ్ళీ దీనిపై ఎలాంటి ఊసు బయటకి రాలేదు.

అయితే ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. మెగాస్టార్ తో థమన్ కలిసి ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు తన మాస్ పాటలతో ఊపేస్తున్న సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ కూడా మెగాస్టార్ తో తన డ్రీం ఫ్రేమ్ అంటూ షేర్ చేసిన పిక్ వైరల్ గా మారింది.

అయితే ఈ కలయిక కేవలం మామూలుగానే కాదు కాకా కోసమే అన్నట్టు తెలుస్తుంది. సో తన పదునైన సాహిత్యంతో మెగాస్టార్ కి ఏ ఎలివేషన్స్ రాసారో వినాలి మరి. ఆల్రెడీ తన ఆయా షేర్ ఇప్పటికీ రూల్ చేస్తుంది. ఇక కాకా కి తన వర్క్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు