మల్టీ స్టారర్ కు సిద్దమైన నారా రోహిత్!
Published on Oct 10, 2017 1:35 pm IST

యంగ్ హీరో నారా రోహిత్ బరువు తగ్గి కొత్త మేకోవర్ తో పవన్ మల్లెల డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ‘బాలకృష్ణుడు’ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. అది కూడా మల్టీ స్టారర్ కావడం విశేషం. మొదటి నుండి మల్టీ స్టారర్ సినిమాలకు పెద్ద పీఠ వేస్తూ వస్తున్న రోహిత్ ఈ సినిమాలో జగపతిబాబులో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రం రేపే లాంచ్ కానుంది. ఈ చిత్రం కొత్త తరహాలో ఉంటుందని, రోహిత్ పాత్ర కూడా భిన్నంగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో హీరోయిన్ ఎవరు, రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook