ఇంటర్వ్యూ : నారా రోహిత్ – కేవలం ఆ ఒక్క కారణంతోనే ‘బాలకృష్ణుడు’ అనే టైటిల్ పెట్టాం
Published on Nov 20, 2017 4:17 pm IST

హీరో నారా రోహిత్ చేసిన తాజా చిత్రం ‘బాలకృష్ణుడు’. ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించిన పలు విశేషాలను వెల్లడించారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే కథ మరీ కొత్తగా ఏమీ ఉండదు. కానీ దాన్ని ఎంటర్టైనింగా చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది.

ప్ర) భిన్నమైన జానర్స్ చేస్తున్న మీరు ఉన్నట్టుండి కమర్షియల్ సినిమా చేయడానికి కారణం ?
జ) ప్రత్యేకమైన కారణమేమీలేదు. ఎన్నాళ్ల నుండో ఇలాంటి కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటూ వస్తున్నాను. అలాంటి సమయంలోనే ఈ చిత్రం కుదిరింది.

ప్ర) దర్శకుడు పవన్ మల్లెల కొత్త వ్యక్తి కదా రిస్క్ అనిపించలేదా ?
జ) నేను చాలా మంది కొత్త దర్శకులతో పనిచేశాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పవన్ మొదటి సిట్టింగ్లోనే కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఒప్పుకున్నాను.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పాత్ర పేరు బాలు. డబ్బు కోసం ఏమైనా చేసే క్యారెక్టర్. అలాగని నెగెటివ్ షేడ్స్ ఉండవు. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే భిన్నమైన క్యారెక్టర్.

ప్ర) ఈ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది ?
జ) నటుడు అజయ్ ద్వారా ఈ సినిమా నా దగ్గరకు వచ్చింది. ఎప్పుడూ దానితో ఒక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేయాలనుంది చెప్తుండేవాడిని. అందుకే అజయ్ ఈ కథకు నన్ను సజెస్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రధాన విలన్ కూడా అతనే.

ప్ర) సినిమాకి ‘బాలకృష్ణుడు’ అనే టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా ?
జ) ప్రత్యేకమైన రీజన్స్ అంటూ ఏం లేవు. టైటిల్ ద్వారానే సినిమా కమర్షియల్ అని తెలుసిపోవాలి. అలాంటి టైటిల్ కోసం ఆలోచిస్తుంటే పవన్ మలెల్ల ఈ ‘బాలకృష్ణుడు’ అనే పేరును సజెస్ట్ చేశాడు. అందరికీ నచ్చడంతో దాన్నే ఖాయం చేశాం.

ప్ర) ఈ సినిమా కకోసం బాగా బరువు తగినట్టున్నారు ?
జ) ప్రత్యేకంగా ఈ సినిమా కోసమనేం కాదు. తగ్గాలని అనుకుంటుండగా పవన్ మల్లెల కాస్త పుష్ చేసి తగ్గితే బాగుంటుందని చెప్పడంతో తగ్గాను.

ప్ర) మొత్తం ఎన్ని కిలోలు తగ్గారు ?
జ) జ్యోఅచ్యుతానందకి ఈ సినిమాకి దాదాపు 21 కిలోలు తగ్గాను.

ప్ర) ఇందులో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తారా ?
జ) లేదు. పూర్తిస్థాయి సిక్స్ ప్యాక్ చేయలేదు. పోస్టర్లో ఎంతవరకు కనిపిస్తానో అలానే ఉంటాను సినిమాలో కూడ.

ప్ర) చివరి సంవత్సరం 5 సినిమాలు చేశారు.. ఏ ఏడాది తగ్గాయందుకని ?
జ) లాస్ట్ ఇయర్ అన్ని సినిమాలు ఉండటం వలన సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. వరుస షూటింగ్స్ వలన నా సినిమాల్ని థియేటర్ కి వెళ్లి చూసే గ్యాప్ కూడా దొరకలేదు. అందుకే కొంచెం నిదానంగా సినిమాలు చేస్తున్నాను.

ప్ర) ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) రెజీనా ఇందులో నార్మల్ హీరోయిన్ లా కాకుండా ఒక టామ్ బాయ్ లా కనిపిస్తుంది. సినిమా ఆరంభం నుండి చివరి వరకు ఉంటుంది.

ప్ర) మీ నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి ?
జ) పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతిబాబుగారితో కలిసి ‘ఆటగాళ్ళు’ అనే సినిమా చేస్తున్నాను. అది థ్రిల్లర్. చైతన్య దంతులూరితో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేశాను. అలాగే కొన్ని లవ్ స్టోరీలు కూడా వింటున్నాను.

 
Like us on Facebook