టాలీవుడ్ హీరోల సందేశానికి మోదీ ఫిదా..!

Published on Apr 4, 2020 1:30 am IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. అయితే మన దేశంలో కరోనా కేసుల పరిస్థితి మిగతా దేశాలతో పోల్చుకుంటే కాస్త తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనాను వ్యాప్తి కానివ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది.

అయితే ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ని మాత్రం కొందరు సీరియస్‌గా తీసుకుంటుంటే, మరికొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. ఇస్టమొచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. అయితే కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అవగాహన చర్యలకు మద్ధతుగా మన టాలీవుడ్ కూడా నిలిచింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఓ చక్కని సందేశాన్ని పాట రూపంలో అందించారు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కోటి అందరూ కలిసి ఈ పాట పాడారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ చిరంజీవి గారికి, నాగార్జున గారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు అంటూ అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం, అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామని తెలిపింది.

సంబంధిత సమాచారం :

X
More