నేషనల్ వైడ్ సాలిడ్ ప్రమోషన్స్ కి రెడీ అయ్యిన “కేజీయఫ్ 2” టీం.!

Published on Apr 1, 2022 7:05 pm IST

మళ్ళీ పాన్ ఇండియా మార్కెట్ లో ఓ భారీ సినిమా కోసం ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “కేజీయఫ్ చాప్టర్ 2” అని చెప్పాలి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.

బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఓ సీక్వెల్ కోసం అన్ని భాషల ఆడియెన్స్ ఎదురు చూసేలా ఈ సినిమా ఇప్పుడు చేసింది. దానికి నిదర్శనంగా ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ కోసమే చెప్పుకోవచ్చు. మరి ఇపుడు మేకర్స్ అన్ని భాషల్లో కూడా సాలిడ్ ప్రమోషన్స్ ని ప్రిపేర్ చేస్తుండగా ఆల్రెడీ చిత్ర యూనిట్ ఇంటర్వూస్ నిమిత్తం ఢిల్లీ లో ల్యాండ్ అయ్యినట్టు తెలిపారు.

మరి ఇక్కడ నుంచి ఈ సినిమా నేషనల్ లెవెల్ బజ్ ని మరింత స్థాయిలో సెట్ చెయ్యడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక రవి బాసృర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :