టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “నాయకుడు”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “నాయకుడు”

Published on Dec 7, 2023 12:00 AM IST

వడివేలు, ఫాహద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా మామన్నన్. ఈ చిత్రం తెలుగు లో నాయకుడు పేరిట రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా దక్కించుకుంది.

తాజాగా స్టార్ మా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు సినిమా స్టార్ మా lo ప్రసారం కానుంది. రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు