నయనతార సినిమా టీజర్ ఈరోజు విడుదల !
Published on Mar 8, 2018 12:06 pm IST

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరమ్’. ఈ చిత్రం ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో మార్చి 16 న విడుదలకాబోతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్ రవీంద్రన్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ అధినేత శరత్ మరార్ సంయుక్తం‌గా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమిళ్ లో ఈ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టిజర్ ఈరోజు విడుదల కాబోతోంది. నయనతార ఈ మూవీలో జిల్లా కలెక్టర్‌గా నటించింది. ఈ మధ్యే తెలుగు‌లో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్‌ పొందింది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫి అందించిన సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు.

 
Like us on Facebook