ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తుంది. దీంతో ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో ఒకటి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేయగా.. రెండోది తెలుగు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన హిస్టారికల్ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న దేశ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్‌కు నార్త్‌తో పాటు సౌత్‌లోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్ 11(ఏప్రిల్ 10 అర్థరాత్రి) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తుంది.
ఇక టాలీవుడ్‌లో తెరకెక్కిన కోర్టు డ్రామా చిత్రం ‘కోర్ట్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా నుంచి వచ్చిన ఈ మూవీని దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్‌లో నటించారు. పోక్సో చట్టం పై నడిచే ఈ కోర్టు రూం డ్రామా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. ఇలా ఒకే రోజు రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్‌లో వీటిని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.