వైరల్ : నెట్ ఫ్లిక్స్ “బాహుబలి” ఫన్నీ మీమ్ పై ‘RRR’ రిప్లై.!

Published on Mar 18, 2022 8:00 am IST

పాన్ ఇండియా సినిమాని ఆల్రెడీ షేక్ చేసి ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం “బాహుబలి 2” అలాగే ఇప్పుడు మళ్ళీ దానికి మించి ఇండియన్ రికార్డ్స్ సెట్ చెయ్యడానికి వస్తున్న అందులోని అదే బాహుబలి మేకర్స్ నుంచి వస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”.

ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా బాహుబలి 2 లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా లు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే బాహుబలి 2 లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పై ఇండియా నెట్ ఫ్లిక్స్ వారు ఒక ఫన్నీ మీమ్ ని వేయగా దానికి “RRR” సోషల్ మీడియా వారు ఓ రేంజ్ లో నవ్వుతూ రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది.

ఇంతకీ అంత నవ్వొచ్చే అంశం ఏమిటంటే బాహుబలి 2 లో ప్రభాస్ ని ఎలివేట్ చేస్తూ కట్టప్ప ఓ రేంజ్ లో డైలాగ్ చెప్తాడు. దానిపై ఈ రేంజ్ లో ఎలివేట్ చేసాడు లాట్ చేసి పొడిచేసాడు అంటూ పోస్ట్ పెట్టగా అది చూసి RRR వారు నవ్వుతూ రిప్లై ఇవ్వడంతో ఈ ఫన్నీ కన్వర్జేషన్ వైరల్ గా మారింది. అభిమానులు అయితే ఈ మీమ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :