అన్స్టాపబుల్ విత్ NBK: మహేష్ బాబు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్

Published on Feb 3, 2022 7:30 pm IST

ఆహా యొక్క ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK యొక్క ఎపిసోడ్ రేపు ప్రీమియర్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫైనల్ ఎపిసోడ్‌కి మహేష్ బాబు సెలబ్రిటీ గెస్ట్‌గా వచ్చారు. ప్రీమియర్‌కు ముందు, మేకర్స్ కొత్త ప్రోమోను విడుదల చేశారు.

ఇందులో మహేష్ బాబు కి సంబంధించిన సరికొత్త విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. సరదాగా సాగే ప్రోమో ఆకట్టుకుంది. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడి కానున్నాయి. ఆహా సూపర్ ఎపిసోడ్ రేపు రాత్రి 8 గంటలకు ప్రసారానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

సంబంధిత సమాచారం :