‘భరత్ అనే నేను’ కొత్త రిలీజ్ డేట్ ఖాయమైపోయింది !
Published on Oct 26, 2017 11:26 am IST

కొద్దిరోజుల క్రితం ‘స్పైడర్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే ‘భరత్ అనే నేను’ సినిమాతో సందడి చేయనున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్ గా నిలవడంతో ఈ చిత్రంపై కూడా భారీ ఆశల్ని పెట్టుకున్నారు మహేష్ అభిమానులు.

అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా రాజకీయ కోణానికి కమర్షియల్ అంశాలను కలిపి గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల. ఇకపోతే ముందుగా ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ నెల 20న విడుదల చేస్తారని వార్త బయటకిరాగా ఇప్పుడు 27న రిలీజ్ చేయనున్నట్లు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook